సీఎం ఇలాకాలో బలవంతపు భూ సేకరణ
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో రైతుల నుంచి భూములను బలవంతంగా గుంజుకునే చర్యలు ఆగడం లేదు. హకీంపేట ఇండస్ట్రియల్ కారిడార్‌కు భూములు ఇవ్వబోమని చెప్తున్నవారి నుంచి నయానో, భయానో సేకరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తాజాగా అధికారులు ఓ రైతు పొలాన్ని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేయగా, ఆయన ఒప్పుకోలేదు.
- రైతు ఆత్మహత్యాయత్నం
- భూమి ఇవ్వనందుకు సర్కార్ పగ రైతు ఆత్మహత్యాయత్నం
- సీఎం రేవంత్ సొంత నియోజకవర్గంలో ఘటన
- హకీంపేట ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూసేకరణ
- మూడెకరాలు ఇచ్చేందుకు రైతు వెంకటయ్య నిరాకరణ
- పొలానికి విద్యుత్తు కనెక్షన్ కట్ చేసిన అధికారులు
- పంట ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన కుటుంబం
- అధికారుల ముందే పురుగుల మందు తాగిన రైతు
- వికారాబాద్ జిల్లా దవాఖానలో కొనసాగుతున్న చికిత్స
- బాధితుడిని పరామర్శించిన సబితా ఇంద్రారెడ్డి, పట్నం
మహబూబ్‌నగర్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/వికారాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో రైతుల నుంచి భూములను బలవంతంగా గుంజుకునే చర్యలు ఆగడం లేదు. హకీంపేట ఇండస్ట్రియల్ కారిడార్‌కు భూములు ఇవ్వబోమని చెప్తున్నవారి నుంచి నయానో, భయానో సేకరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తాజాగా అధికారులు ఓ రైతు పొలాన్ని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేయగా, ఆయన ఒప్పుకోలేదు. దీంతో విద్యుత్తు కనెక్షన్ కట్‌చేయగా, పొలం ఎండిపోయింది. తీవ్ర మనస్తాపం చెందిన ఆ రైతు, అధికారుల ముందే పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఆ రైతు వికారాబాద్ జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన జరిగి రెండు రోజులు గడుస్తున్నా బయటికి రాకుండా బిగ్ షాడో మేనేజ్ చేసినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సోమవారం వికారాబాద్ జిల్లా దవాఖానకు వెళ్లి, బాధిత రైతును పరామర్శించారు.

కోర్టు స్టే ఉన్నా వదలని అధికారులు
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట గ్రామానికి చెందిన డీ వెంకటయ్యకు సర్వేనంబర్ 144/ఆ, 144/ఇ లో మూడు ఎకరాల 12 గుంటల భూమి ఉన్నది. ఈ పొలం లగచర్ల గ్రామ శివారులో ఉంటుంది. హకీంపేట ఇండస్ట్రియల్ కారిడార్ కోసం అధికారులు భూ సేకరణ చేపట్టడంతో, వెంకటయ్య తన భూమిని ఇచ్చేదిలేదని తేల్చి చెప్పారు. హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. తన పొలంలో వరితోపాటు కందులు సాగు చేశారు. తాము భూ సేకరణకు ఒప్పుకోకపోవడంతో అధికారులు తమ పొలానికి ఉన్న విద్యుత్తు కనెక్షన్లను తొలగించారని బాధిత కుటుంబం తెలిపింది. దీంతో పంట మొత్తం ఎండిపోయిందని పేర్కొన్నది.
రైతు వెంకటయ్య ఆదివారం ఉదయం పొలానికి వెళ్లగా అక్కడ దుద్యాల తహసిల్దార్, ఇతర అధికారులు కనిపించారు. రైతు వారిని నిలదీయగా.. ‘నీ పొలాన్ని సర్కార్ తీసుకుంటుంది. మొత్తం చదును చేస్తాం. పంటకు పరిహారం ఇస్తాం’ అని బెదిరించారని రైతు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో వెంకటయ్య తీవ్ర మనస్తాపం చెంది, అక్కడే పొలంలో ఉన్న క్రిమిసంహారక మందు తీసుకొని, ఆఫీసర్ల ముందే తాగాడు. ఒక్కసారిగా షాక్‌కు గురైన అధికారులు, అక్కడి నుంచి జారుకున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బాధితుడిని హుటాహుటిన ఆటోలో కోస్గి దవాఖానకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం, పరిస్థితి విషమించడంతో వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నా భూమి తీసుకోవద్దనే మందు తాగా
నాకున్న భూమిని ఫార్మా కంపెనీల కోసం బలవంతంగా తీసుకుంటున్నారు. అధికారులు కరెంటు కనెక్షన్ తీసేసిండ్రు. చేను మొత్తం ఎండిపోయింది. నా భూమి నాకివ్వాలని అంటే అధికారులు ఇస్తలేరు. అందుకే చనిపోదామని మందు తాగిన.
– డీ వెంకటయ్య, రైతు, హకీంపేట
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

