హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): ప్రపంచ జనాభా దినోత్సవ మాసోత్సవాల్లో భాగంగా నేటి నుంచి 24 వరకు కుటుంబ నియంత్రణ క్యాంపులు నిర్వహిస్తున్నట్టు కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. జూన్ 27 నుంచి జూలై 10 వరకు మొదటి పక్షోత్సవంలో భాగంగా జనాభా పెరుగుదల, దాని వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించినట్టు పేర్కొన్నారు. రెండో పక్షోత్సవంలో భాగంగా కు.ని. ఆపరేషన్లు, బిడ్డల మధ్య ఎడం కోసం తాత్కాలిక నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పిస్తారని వివరించారు.