హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మోడల్, గురుకుల టీచర్లకు ఫ్యామిలీ పెన్షన్ వర్తింపజేయాలని సీపీఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థితప్రజ్ఞ కోరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లోని డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరరీ ఆఫీసులో స్టేట్ సీఫీఎస్ నోడల్ ఆఫీసర్, డీటీఏ డైరెక్టర్ రామచంద్రమూర్తికి సీపీఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్తో కలి సి వినతిపత్రం అందజేశారు.
సీపీఎస్ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఫ్యామిలీ, ఇన్వ్యాల్యుడేషన్ పెన్షన్ అమలు చేయడం లేదని, దీంతో వివిధ కారణాలతో మరణించిన 38 మంది ఉపాధ్యాయుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇప్పటికైనా మోడల్, గురుకుల ఉపాధ్యాయుల సేవలను ప్రభుత్వం గుర్తించి ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు.