హైదరాబాద్ : ప్రేమ వివాహం చేసుకున్నాడని యువకుడిపై యువతి కుటుంబ సభ్యు దాడి చేసి
ఎత్తుకెళ్లిన సంఘన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..మెదక్ జిల్లా సలాబత్పూర్ గ్రామానికి చెందిన యువతిని ఈ నెల 6వ తేదీన ఎల్లపూర్ గ్రామానికి చెందిన ప్రణయ్ అనే యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో ప్రణయ్ కుటుంబ సభ్యులపై యువతి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు.
యువతి ప్రణయ్తోనే ఉంటానని చెప్పడంతో ఇరు కుటుంబాలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. కౌన్సిలింగ్ అనంతరం యువతి బంధువులు నాలుగు కార్లలో ప్రణయ్ ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులపై దాడి చేసి యువతిని బలవంతంగా తీసుకెళ్లారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.