Payal Rajput | టాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తన ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఛానెల్‌కు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి గట్టిగా ఫుల్స్టాప్ పెట్టింది. ఇటీవల కాలంలో సెలబ్రిటీలు తమ అభిమానులకు మరింత దగ్గరవ్వడానికి ప్రత్యేకంగా సబ్స్క్రిప్షన్ ఛానెళ్లను ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పాయల్ రాజ్‌పుత్ ప్రారంభించిన ఈ ఛానెల్‌పై నెట్టింట కొన్ని తప్పుడు అపోహలు, ప్రచారాలు మొదలయ్యాయి. దీనిపై ఆమె తాజాగా స్పందిస్తూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా, అసలు విషయం ఏంటనేది వివరించింది.
చాలా మంది నెటిజన్లు, అభిమానులు తన సబ్‌స్క్రైబర్ ఛానెల్లో ఎలాంటి కంటెంట్ ఉండబోతోందని వరుసగా మెసేజ్‌లు చేస్తున్నారని, అందుకే అందరికీ ఒకేసారి క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్నట్లు పాయల్ తెలిపారు. కేవలం ఎక్స్ప్లిసిట్ కంటెంట్, గ్లామరస్ లేదా ‘హాట్ పిక్స్’ ఆశించి ఎవరైనా తన ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే.. దయచేసి ఆ పని చేయవద్దని ఆమె స్పష్టం చేశారు. అలాంటి వారి కోసం ఈ వేదిక అస్సలు కాదని తేల్చి చెప్పారు. ఒక నటిగా కాకుండా, తెర వెనుక ఉండే తన అసలైన వ్యక్తిత్వాన్ని, నిజ జీవితంలోని అన్ఫిల్టర్డ్ క్షణాలను, తన రోజువారీ ప్రయాణాన్ని పంచుకోవడానికే ఈ ప్రత్యేక ఛానెల్‌ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కేవలం తనను ఒక వ్యక్తిగా ఇష్టపడేవారికే ఈ స్పేస్ స్వాగతం పలుకుతుందని పాయల్ అన్నారు. ఒక మహిళగా, నటిగా తన వ్యక్తిగత హద్దులను అర్థం చేసుకుని, వాటిని గౌరవిస్తున్న ప్రతి ఒక్క అభిమానికి ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.