Kalyani Priyadarshan | ‘కొత్త లోక’ సినిమాతో ఆల్‌టైం బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రముఖ మలయాళ నటి, ‘హలో’ చిత్రం ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ లండన్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో సందడి చేశారు. లండన్‌లోని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో జరుగుతున్న ఈ టెన్నిస్ లీగ్‌ను వీక్షించేందుకు ఆమె ప్రత్యేకంగా హాజరయ్యారు. వెండితెరపై తన నటనతో అలరించే ఈ స్టార్ బ్యూటీ, సెంటర్ కోర్టులో మ్యాచ్‌లను ఎంతో ఉత్సాహంగా వీక్షిస్తూ కెమెరాలకు చిక్కారు.
ఇక క్లాసిక్ లుక్‌లో వింబుల్డన్ మ్యాచ్‌లను ఎంజాయ్ చేస్తున్న కళ్యాణి ప్రియదర్శన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా క్రీడలపై, ముఖ్యంగా టెన్నిస్‌పై తనకున్న ఇష్టాన్ని ఆమె ఈ విధంగా చాటుకున్నారు. లండన్ కోర్టులో మ్యాచ్ ముగిసేవరకు ఉత్కంఠగా సాగిన క్షణాలను ఆమె ఎంతో ఆస్వాదించారని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.
From the big screen to Centre Court, #KalyaniPriyadarshan enjoys a day at #Wimbledon. 🎾#FilmfareSouth #Celebs pic.twitter.com/tDh5DK0im3
— Filmfare (@filmfare) July 9, 2026