హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): పదోతరగతి మెమోను ట్యాంపర్ చేసి ప్రయోజనం పొందబోయి ఓ మహిళ లెక్చరర్ అడ్డంగా దొరికిపోయింది. చివరికి ఉద్యోగం పోగొట్టుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే.. కే గాయ్ర తి 2000 డిసెంబర్ 16న హైదరాబాద్ నాంపల్లిలోని ఎంఏఎం జూనియర్ కాలేజీలో సివిక్స్, హిస్టరీ కాంట్రాక్ట్ లెక్చరర్‌గా చేరింది. అప్పుడు సమర్పించిన ఎస్సెస్సీ మెమోలో పుట్టినతేదీ 6-1-1965గా ఉంది. 2023 మే 3న గాయత్రి సర్వీసును ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. ఈ సందర్భంగా సమర్పించిన మెమో లో పుట్టిన తేదీ 6-1-1970గా ఉంది. వాటిని పరిశీలించిన కాలేజీ ప్రిన్సిపాల్ పుట్టిన తేదీల్లో, పుట్టుమచ్చలు, ఉత్తీర్ణురాలైన తేదీల్లోనూ తేడాలున్నట్టుగా గుర్తించి ఇంటర్అధికారులకు నివేదించారు. ఇప్పటికీ ఆమె తన పీజీ సర్టిఫికెట్‌ను కూడా సమర్పించలేదు. వీటిపై విచారించిన త్రిసభ్య కమిటీ నివేదికను అధికారుల కు సమర్పించింది. ఈమేరకు ఆమె పై 2024 మార్చి 27న బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆమెను డిస్మిస్చేస్తూ ఉత్తర్వులిచ్చారు.