మరికల్, జూన్ 1 : నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ చేసిన నకిలీ పత్తి విత్తనాలను ఆదివారం జిల్లా టాస్క్‌ఫోర్స్, మరికల్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై రాము తెలిపిన వివరాల ప్రకారం.. మరికల్‌కు చెందిన జీ శ్రీనివాసులు, ధన్వాడ మండలం హన్మాన్పల్లికి చెందిన వెంకటయ్య మరికల్‌లోని కుమ్మరివాడలోని ఒక ఇంట్లో 100 కిలోల నకిలీ పత్తి విత్తనాలు ఉంచి రైతులకు విక్రయిస్తున్నారని సమాచారం వచ్చింది. దీంతో జిల్లా టాస్క్‌ఫోర్స్, మరికల్ పోలీసుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఏవో రెహమన్ఖాన్ ఫిర్యాదు మేరకు శ్రీనివాసులు, వెంకటయ్యపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై వెల్లడించారు.