హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): కొంతమంది ఏసీబీ అధికారుల పేరుతో ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఏసీబీ డీజీ విజయ్‌కుమార్ తెలిపారు.
ఈ తరహా మోసం ఇటీవల ఖమ్మంలో వెలుగుచూసిందని, దీనిపై టేకులపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైందని చెప్పారు.