 
                                                            Riyaz Encounter | నిజామాబాద్ రౌడీ షీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌పై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. రియాజ్‌ది ఎన్కౌంటర్ కాదని.. కస్టోడియల్ డెత్ అని తెలిసింది. ఒక ఫేక్ నోట్స్ కుంభకోణం దాచేందుకే ఎన్కౌంటర్ నాటకం ఆడారని అనుమానం వ్యక్తం చేసింది. అంతేకాదు కానిస్టేబుల్ ప్రమోద్ను రియాజ్ చంపలేదని తేల్చింది.
ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం.. రియాజ్ ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. తన వృత్తిలో భాగంగా ఒకరోజు ఆసిఫ్ అనే వ్యక్తి స్కూటీ జప్తు చేశాడు. ఆ స్కూటీలో రియాజ్‌కు 3 లక్షల రూపాయలు దొరికాయి. తీరా చూస్తే అవి ఫేక్ నోట్లు అని రియాజ్ తెలుసుకున్నాడు. ఫేక్ నోట్లను పలువురికి ఇచ్చి UPI ద్వారా నగదు బదిలీ చేయించుకుని, ఆ డబ్బును ఖర్చు చేశాడు. ఒకరోజు ఆసిఫ్ వచ్చి తన బండి, 3 లక్షలు ఇవ్వాలని, లేకపోతే తన కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరించాడు.
రియాజ్‌కు ఏం చేయాలో తెలియక.. ప్రమోద్ అనే ఒక కానిస్టేబుల్‌ను సంప్రదించి కాపాడమని వేడుకున్నాడు. ప్రమోద్, రియాజ్‌ను ఒక ఉన్నతాధికారి వద్దకు తీసుకెళ్లగా, అతను రూ.1 లక్ష లంచం డిమాండ్ చేశాడు. తాను అంత డబ్బు ఇవ్వలేనని రియాజ్ చెప్పడంతో.. అతన్ని ఎరగా వేసి ఫేక్ నోట్ల స్కామ్ బయటపెట్టాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. ఇదంతా గ్రహించి ఆసిఫ్ పారిపోయాడు. రియాజ్ ఇన్ఫార్మర్గా మారాడని అనుమానంతో, అతన్ని చంపేందుకు ఆసిఫ్ గ్యాంగ్ నిర్ణయించుకుంది. దీంతో రూ.1 లక్ష లంచం ఇస్తే ఆసిఫ్ గ్యాంగ్ నుంచి కాపాడతామని రియాజ్‌కు పోలీసులు తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్కౌంటర్ జరిగినప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎంతో హంగామా చేశారు
ఈరోజు ఎందుకు మౌనంగా ఉన్నారు? అధికారంలో ఉన్నారనా?
అక్కడ రాహుల్ గాంధీ రాజ్యాంగం గురించి ఏవేవో చెప్తున్నాడు..అవన్నీ తెలంగాణలో వర్తించవా?
రాష్ట్ర హోంమంత్రి కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉంది, ఆయనకు ఆ శాఖ… https://t.co/lxJENTsgPd pic.twitter.com/sKdCKxCKEb
— Telugu Scribe (@TeluguScribe) October 31, 2025
స్థానికుల సమాచారం ప్రకారం.. అక్టోబర్ 17వ తేదీన రియాజ్, ప్రమోద్ పోలీసులు తెలిపిన స్థలంలో కాకుండా రహస్యంగా కలుసుకుని, లంచం గురించి చర్చించుకున్నారు. రియాజ్, కానిస్టేబుల్ ప్రమోద్ రహస్యంగా కలుసుకున్న విషయం తెలిసి, రియాజ్‌ను చంపేందుకు ఆసిఫ్ గ్యాంగ్ వచ్చింది. ఆ గ్యాంగ్ దాడిలో రియాజ్ తప్పించుకున్నాడు. కానీ కానిస్టేబుల్ మృతి చెందాడు. చిన్న గాయంతో ఉన్న ఆసిఫ్‌ను హైదరాబాద్ ఆసుపత్రికి ఎందుకు తరలించారు అనేది సందేహాలకు తావిస్తుంది.
ఎలాంటి విచారణ లేకుండా కానిస్టేబుల్ ప్రమోద్ను రియాజ్ చంపాడని పోలీసులు నిర్ధారించారని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రమోద్ మృతదేహం వీడియోలు, ఫోటోలు కూడా పోలీసులు తీయలేదని పేర్కొన్నారు. రియాజ్ కోసం వెతికే క్రమంలో అతని భార్య, తల్లి, ఇద్దరు మైనర్ పిల్లలను రెండు రోజులు అక్రమంగా స్టేషన్లో నిర్బంధించారని చెప్పారు. అతని భార్య, తల్లిపై పోలీసులు లైంగిక దాడులు చేశారని అన్నారు. ప్రైవేట్ భాగాల్లో కారంపొడి చల్లారన్నారు. రియాజ్ మైనర్ పిల్లలను తలకిందులుగా వేలాడదీసి, వారి దుస్తుల్లోకి బల్లులు, కప్పలను వదిలి చిత్రహింసలు పెట్టారని పేర్కొన్నారు.
రియాజ్ ది ముమ్మాటికి కస్టోడియల్ డెత్
అతను చనిపోయాక ఆసుపత్రికి తీసుకెళ్లారు https://t.co/5z0ijo3OHM pic.twitter.com/tamfJiSwDO
— Telugu Scribe (@TeluguScribe) October 31, 2025
రియాజ్ పట్టుబడ్డాక కోర్టులో హాజరు పరచకుండా నేరుగా అరెస్టు చేసి అతన్ని చిత్రహింసలు పెట్టారని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సభ్యులు తెలిపారు. థర్డ్ డిగ్రీ చేయడంతో రియాజ్ కస్టడీలోనే చనిపోయాడని అన్నారు. చనిపోయిన రియాజ్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి, తప్పించుకోబోతే ఎన్కౌంటర్ చేశామని పోలీసులు అబద్ధాలు చెబుతున్నారని తెలిపారు. రియాజ్ స్కూటీ, హత్య చేసిన ఆయుధం లాంటి ఆధారాలు ఏవీ పోలీసులు ప్రవేశపెట్టలేదని పేర్కొన్నారు. కాల్ రికార్డింగ్స్, సీసీటీవీ ఫుటేజ్ లాంటివన్నీ పోలీసుల అదుపులోనే ఉన్నాయని అన్నారు. ఈ ఎన్కౌంటర్ కచ్చితంగా ఒక కస్టొడియల్ డెత్ కవర్ చేసే బూటకం మాత్రమే అని స్పష్టం చేశారు. ఒక ఫేక్ నోట్స్ కుంభకోణం దాచిపెట్టేందుకే ఈ ఎన్కౌంటర్ నాటకం ఆడినట్లు మాకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. దీనిపై సీబీఐ ఎంక్వయిరీ జరిపించాలని హైకోర్టు న్యాయమూర్తిని అడుగుతామన్నారు.

Fact Finding Report1

Fact Finding Report2

Fact Finding Report3

Fact Finding Report4

Fact Finding Report5

Fact Finding Report6

Fact Finding Report7

Fact Finding Report8

Fact Finding Report9

Fact Finding Report10
 
                            