హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ) : ఎఫ్ అంటే ఫారెస్టే మాత్రమే కాదని, ఆదివాసీల ఫ్యూచర్ కూడా అని మంత్రి సీతక చెప్పారు. హైదరాబాద్లోని తాజ్డెకన్లో ‘పీఎం జన్మన్’, ‘ధర్తి ఆబ జనజాతీయ గ్రామీణ ఉతర్ష్ అభియాన్’పై సౌత్ ఈస్ట్ రాష్ట్రాల వర్షాప్ను ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో ఎదురవుతున్న సవాళ్లు, పరిషార మార్గాలు, శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే బేగంపేటలోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) నిర్వహించిన యంగ్ లైవ్స్ రౌండ్-7 సర్వే నివేదికను మంత్రి సీతక విడుదల చేశారు.