హైదరాబాద్, జూలై 30(నమస్తే తెలంగాణ): గోలొండ కోటలో జరిగే పంద్రాగస్టు వేడుకలకు విస్తృత ఏర్పాట్లుచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. సీఎం.. అమరవీరుల స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించి అనంతరం చారిత్రాత్మక గోలొండ కోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై బుధవారం సచివాలయంలో ఆయన సమీక్షించి అధి కారులకు ఆదేశాలు చేశారు.