హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 1,037మంది పంచాయతీ కార్యదర్శుల సేవలను ఔట్సోర్సింగ్ పద్ధతిలో కొనసాగించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలో పనిచేస్తున్న వీరి సేవలను 2025 ఏప్రిల్ 1నుంచి 2026 మార్చి 31 వరకు లేదా రెగ్యులర్ పోస్టుల భర్తీ అయ్యే వరకు లేదా అవసరం తీరే వరకు కొనసాగించడానికి అనుమతినిచ్చింది. ఈ మేరకు మంగళవారం ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా జీవో జారీచేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఆధీనంలో వీరంతా పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు.