తిరువనంతపురం, అక్టోబర్ 11: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమల ఆలయ భక్తులకు శుభవార్త. ఇక నుంచి భక్తులు 17 గంటల పాటు అయ్యప్పను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) ప్రకటించింది. రాబోయే మండ లం మకరవిలక్కు సీజన్‌ను పురస్కరించుకుని ఉదయం 3 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనానికి అనుమతి ఇస్తామని టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు. స్పాట్ బుకింగ్ కాకుండా ఆన్లైన్లో బు క్ చేసుకోవాలని స్పష్టం చేశారు.