హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): దేవాదులతోపాటు పలు ప్రాజెక్టుల కాంట్రాక్టు టెండర్ గడువును మరోసారి పొడిగించారు. శుక్రవారం నిర్వహించిన స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
సమావేశంలో రివైజ్డ్ ఎస్టిమేట్లు, టెండర్ ఎక్స్టెన్షన్లపై (ఈవోటీ) చర్చించాల్సి ఉన్నప్పటికీ, పలువురు అధికారులు హాజరుకాకపోవడంతో కేవలం ఈవోటీలపైనే చర్చించారు.