హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 16( నమస్తే తెలంగాణ ): అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించినట్టు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు పెరిక యాదయ్య తెలిపారు.
విదేశాల్లో ఉన్నత చదువులకు ఉపకార వేతనాల కోసం అర్హులైన ఎస్సీ విద్యార్థులు ఈ నెల 29 వరకు దరఖాస్తు చేసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. వివరాలకు https:// talanganaepass. cgg.gov.in వెబ్సైట్ను సందర్శించాలని పేర్కొన్నారు.