హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ప్రీ-ప్రైమరీ ఎడ్యుకేషన్లో భాగంగా డీపీఎస్సీ (డిప్లమో ఇన్ ప్రీ-సూల్ ఎడ్యుకేషన్) అర్హత ఉన్నవారి నియామకాలపై నిర్ణయం తీసుకోకపోవడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వా న్ని కోరింది. ప్రీ-ప్రైమరీ టీచర్ల నియామకాలను చేపట్టకపోవడంపై కౌంటర్ దాఖలు చేయాలని నో టీసులు జారీచేసింది. జాతీయ విద్యావిధానం-2020 ప్రకారం ప్రీ-ప్రైమరీ టీచర్లుగా డీపీఎస్సీ పూ ర్తి చేసినవారిని నియమించాల్సి ఉన్నా ప్రభుత్వ జీవో 25లో డీపీఎస్సీ అభ్యర్థులను చేర్చలేదంటూ 36 మంది దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ సూరేపల్లి నంద ఇటీవల విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఇప్పటికే ఏపీ, కేరళ, పంజాబ్ తదితర రాష్ర్టాల్లో ప్రీ-ప్రైమరీ టీచర్లుగా డీపీఎస్సీ అభ్యర్థులను నియమిస్తున్నారని తెలిపా రు. తెలంగాణలో 400 మందికిపైగా అభ్యర్థులు డీపీఎస్సీ కోర్సు పూర్తిచేసినా వారిని ప్రభుత్వ పాఠశాలల్లో నియమించలేదని పేర్కొన్నారు.