వేములవాడ టౌన్, సెప్టెంబర్ 9: వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు శృంగేరి పీఠం అనుమతి కోసం విప్ ఆది శ్రీనివాస్, సీఎంవో వోఎస్డీ వేముల శ్రీనివాసులు, ఆలయ ఈవో వినోద్‌రెడ్డి బృందం సోమవారం శృంగేరీ పీఠాన్ని సందర్శించారు. విప్ బృందం పీఠాధిపతులు జగద్గురు భారతీ తీర్థ మహాస్వామితోపాటు విధుశేఖర భారతీ స్వామిని కలిసి ఆలయ విస్తరణ నమూనాను చూపించింది. వారి సూచననలు, సలహాలకు అనుగుణంగా ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం విస్తరణ పనులు చేపట్టేందుకు విప్ అనుమతి కోరారు. ఈ సందర్భంగా వారు శుభం అని చెప్పి ఆలయ విస్తరణకు ముందుకెళ్లాలని మౌఖికంగా ఆదేశించారు. త్వరలోనే జగద్గురువులు రాజన్న ఆలయాన్ని సందర్శిస్తారని పేర్కొన్నారు.