Telangana DGP | డీజీపీ మార్పుపై ఉత్కంఠ! రేసులో ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్
Telangana DGP | రాష్ట్రంలో డీజీపీని మార్చుతారనే చర్చ జోరుగా సాగుతున్నది. నెక్ట్స్ పోలీస్ బాస్ ఎవరనే ఉత్కంఠ పోలీసువర్గాల్లో మొదలైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ బదిలీల్లో డీజీపీగా నియమితులైన రవిగుప్తాకే కొత్త ప్రభుత్వం పూర్తి బాధ్యతలు ఇచ్చింది.
- ఈ ఏడాది చివరిలో శివధర్‌రెడ్డికి చాన్స్?
- వారంలోపే సీనియర్ ఐపీఎస్‌ల బదిలీలు!
Telangana DGP | హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డీజీపీని మార్చుతారనే చర్చ జోరుగా సాగుతున్నది. నెక్ట్స్ పోలీస్ బాస్ ఎవరనే ఉత్కంఠ పోలీసువర్గాల్లో మొదలైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ బదిలీల్లో డీజీపీగా నియమితులైన రవిగుప్తాకే కొత్త ప్రభుత్వం పూర్తి బాధ్యతలు ఇచ్చింది. ఇటీవల రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పడం, ఎక్కడ చూసినా చైన్‌స్నాచింగ్ ముఠాలు, దోపిడీ గ్యాంగులు హల్చల్ చేస్తుండటం, నడిరోడ్లపైనే హత్యలు జరుగుతుండటంతో డీజీపీ మార్పు అనివార్యంగానే కనిపిస్తున్నట్టు పోలీసువర్గాలు చెప్తున్నాయి.
ఇప్పటికిప్పుడు డీజీపీని మార్చితే.. డీజీ హోదా కలిగిన జితేందర్ ఐపీఎస్‌కు అవకాశం ఉన్నదని అంటున్నారు. 1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్ ఏసీబీని ఓ గాడిలో పెట్టడంతో ఆయన్నే ఏసీబీ డీజీగా కొనసాగిస్తారని చెప్తున్నారు. 1990 బ్యాచ్‌కు చెందిన అంజనీకుమార్ ఇప్పటికే డీజీపీగా చేయడం, అదే బ్యాచ్‌కు చెందిన రవిగుప్తా డీజీపీగా కొనసాగుతుండటం, 1991వ బ్యాచ్‌కు చెందిన రాజీవ్త్రన్ గుండెపోటుతో చనిపోవడంతో 1992వ బ్యా చ్‌కు చెందిన జితేందర్ డీజీపీగా నియమిస్తారనే చర్చ కొనసాగుతున్నది.
1993వ బ్యాచ్‌కు చెంది న సందీప్‌శాండిల్య ఇటీవల పదవి విరమణ పొందటం, 1994 బ్యాచ్‌కు చెందిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ సీపీగా ఉండగా, సౌమ్యమిశ్రా జైళ్లశాఖ డీజీగా, శివధర్‌రెడ్డి ఇంటెలిజెన్స్ డీజీగా, శిఖాగోయెల్ ఉమెన్ సేఫ్టీ వింగ్ సీఐడీగా, ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీగా, అభిలాష బిస్త్ పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. వీరికి ఇంకా డీజీపీ హోదా రాకపోవడంతో సీనియర్ అయిన జితేందర్, సీవీ ఆనంద్‌కే డీజీపీ అవకాశం ఎక్కువగా ఉన్నట్టు పోలీసువర్గాలు చెప్తున్నాయి. వీరిద్దరిలో ఎవరినో ఒకరిని డీజీపీగా నియమించినా.. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది త్రైమాసికంలోనే డీజీపీగా శివధర్‌రెడ్డిని నియమిస్తారని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 28 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం.. వారంలోపే సీనియర్ ఐపీఎస్‌లకు సైతం స్థానచలనం కల్పించనున్నట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

