హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ కట్టడికి నిరంతరం దాడులు చే యాలని ఎైక్సెజ్ కమిషనర్ ఈ శ్రీధర్ సంబంధిత పోలీసులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఎైక్సెజ్ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలపై గురువారం సమీక్షించారు.
ఈ సందర్భంగా రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ దశరథ్, అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్‌తో కలిసి ‘సే నో డ్రగ్స్’ పేరిట రూపొందించిన టీ షర్ట్‌లను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పొరుగు రాష్ర్టాల నుంచి సరఫరా అవుతున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌పై నిఘాపెట్టాలని సూచించారు. రంగారెడ్డిలో ఎన్‌డీసీఎల్ మద్యం పట్టివేత, కేసుల నమోదుపై ఆరాతీశారు.