హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరిగినందున అనేక రీజియన్స్‌లో ప్రమోషన్స్‌కు అవసరమైన ఐదేండ్ల సర్వీస్ పూర్తి కానివారు చాలామంది ఉన్నారని, వారికి కూడా ప్రమోషన్ వచ్చేలాగా ఐదేండ్ల సర్వీసును మూడేండ్లకు తగ్గించాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ కోరింది.
ఈ మేరకు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి శనివారం వినతిపత్రం ఇచ్చింది. 31 ఆగస్టు 2026 నాటికి రీజియన్/జోనల్ సీనియారిటీలో ఉన్న ప్రమోషన్లు ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు విడుదల చేసినందుకు రాష్ట్ర కమిటీ ధన్యవాదాలు తెలిపింది. జేఏసీ ఇచ్చిన సమ్మె నోటీస్, స్టాఫ్ అండ్ వరర్స్ ఫెడరేషన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ ద్వారా ఇచ్చిన వినతిపత్రాల్లోని అంశాలను త్వరగా నెరవేర్చాలని రాష్ట్ర నాయకులు కోరారు.