Warangal | విజయ గర్జన సభ కోసం స్థలాల పరిశీలన
విజయ గర్జన సభ | వరంగల్ నగర సమీపంలోని శివారు ప్రాంతాలు మడికొండ, ఉనికిచర్ల, రాంపూర్ వద్ద ఖాళీ స్థలాలను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ వినయ్ భాస్కర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ డిప్యూటీ సిఎంకడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఇతర స్థానిక నేతలు కలిసి సోమవారం పరిశీలించారు.

వరంగల్ : తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 20 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చారిత్రక వరంగల్ నగరంలో ఈ నెల 15వ తేదీన విజయ గర్జన సభ పెట్టాలని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయించారు. దాదాపు 10 లక్షల మందితో భారీ ఎత్తున సభను ఈ సభ నిర్వహించి, విజయవంతం చేయాలని పార్టీ ముఖ్యనేతలకు సూచించారు.
ఇందులో భాగంగా వరంగల్ నగర సమీపంలోని శివారు ప్రాంతాలు మడికొండ, ఉనికిచర్ల, రాంపూర్ వద్ద ఖాళీ స్థలాలను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఇతర స్థానిక నేతలతో కలిసి సోమవారం పరిశీలించారు.

ఈ విజయ గర్జన సభకు భారీ ఎత్తున జనాలు రానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఆటంకాలు కలుగకుండా అన్ని హంగులతో సభ నిర్వహించేందుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నారు. పార్టీ స్థాపించి 20 వసంతాలు పూర్తయిన సందర్భంగా పార్టీ సాధించిన విజయాలను, ప్రభుత్వం సాధించిన ప్రగతిని, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకతను ముఖ్యమంత్రి కేసిఆర్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు నివేదించనున్నారు.

ఇవి కూడా చదవండి..
Khammam | బుల్లెట్‌పై తిరుగుతూ..చెక్కులు పంచుతూ
Warangal | వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత
Yadadri Temple | యాదాద్రిలో లక్ష పుష్పార్చన
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

