BJP Fake Websites | హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): పరీక్ష పేపర్లు లీక్చేస్తారు.. సోషల్‌మీడియాలో పోస్ట్చేస్తారు.. వాళ్లే పేపర్ లీకైందని ప్రచారం మొదలుపెడుతారు.. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తారు.. సోషల్‌మీడియాలో పుంఖానుపుంఖాలుగా సందేశాలు వదులుతూ వాళ్లు చెప్పేదే నిజమని నమ్మేలా ప్రజలను గందరగోళానికి గురిచేస్తారు. ఇందుకోసం లెక్కలేనన్ని నకిలీ వెబ్సైట్లను సృష్టించి వాడుతారు.. ఇదీ రాష్ట్రంలో, దేశంలో బీజేపీ కుట్ర. ఈ కుట్రను టెక్ నిపుణులు బట్టయబలు చేశారు. ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్నచోట ప్రభుత్వంపై స్వయంగా నేరాలు చేసి, వాటిని ప్రభుత్వాలకు ఆపాదించి బురదజల్లేందుకు బీజేపీ దన్నుతో పదుల సంఖ్యలో వెబ్సైట్లు నడుస్తున్నట్టు అభిషేక్సాయి అనే వ్యక్తి బటయపెట్టారు. 12.232.63.153 అనే ఒకే ఒక్క ఐపీ అడ్రస్‌పై ఏకంగా 23 వెబ్సైట్లను సృష్టించినట్టు నిర్వహిస్తున్నట్టు వరుస ట్వీట్లు చేశారు. ఇందులో తెలంగాణ ఆత్మగౌరవం.కామ్ అనే వెబ్సైట్ కూడా ఉన్నది. రాష్ట్రంలో ప్రస్తుతం పేపర్ లీకేజీల అంశంపై ఈ వెబ్సైట్లే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి.
పలు వెబ్సైట్లు బీజేపీకి అనుకూలంగా, దాని ప్రత్యర్థి పార్టీలకు వ్యతిరేంకా డిజిటల్ మీడియాలో భారీగా కంటెంట్ చొప్పిస్తుండటంతో అనుమానం వచ్చిన కొందరు వాటి ఐపీ అడ్రస్‌లను వెదికే పని మొలుపెట్టారు. రివర్స్ ఐపీ లుకప్ అనే టెక్నిక్ద్వారా లోతుగా పరిశీలించగా 13.232.63.153 ఐపీ అడ్రస్‌పై ‘ఫిర్ఏక్బార్మోదీసర్కార్.కామ్’ అనే వెబ్సైట్ ఉన్నట్టు గుర్తించారు. ఇదే ఐపీ అడ్రస్‌పై 2019 డిసెంబర్ నుంచి ఏకంగా 23 వెబ్సైట్లను సృష్టించారు. ఈ ఐపీ అడ్రస్‌పై 2022 అక్టోబర్ నాటికి 14 వెబ్సైట్లు నడుస్తున్నాయి. 2022 అక్టోబర్ 13 నుంచి 2023 మార్చి 14 వరకు ఈ వెబ్సైట్లన్నింటికీ ఒకటే హోంపేజ్, ఇంటర్ఫేస్, ఫొటోలు, ఫేస్బుక్ పేజ్ లింక్‌లు ఉన్నట్టు అభిషేక్సాయి పరిశోధనలో తేలింది.
1.jharkhand2019(.)com
2.chormachayeshor(.)com
3.ghargharraghubar(.)com
4.thefrustratedbengali(.)com
5.phirekbaarmodisarkar(.)com
6.modisandnitish(.)com
7.nirmamata(.)com
8.up2022(.)com
9.bhakbudbak(.)com
10.mahathungbandhan(.)com
11. telanganaamagouravam(.)com
12.kamaldobara(.)com
13.olirattumputhuvai(.)com
14.valarchipaadaiyiltamizhagam(.)com
15.theindiancompass(.)com
16.buababua(.)com
17.teisheabarbjpsarkaar(.)com
18. modisaatherajasthan(.)com
19.meghalayawithmodi(.)com
20.mp2023(.)com
21.pappugappu(.)com
22.shivshahiparat(.)com
23.chuntliexpress(.)com