BRS MLA Kaushik Reddy | హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు కారణాలు తెలుపకుండా అరెస్టు చేయడాన్ని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తీవ్రంగా ఖండించారు. కౌశిక్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేస్తున్నారో?, ఏ సెక్షన్ కింద అదుపులో తీసుకున్నారో? ముందుగా చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని వినోద్ కుమార్ అన్నారు.
కారణాలు ముందస్తుగా చెప్పక పోవడం రాజ్యాంగం ప్రకారం తప్పు, ఇది చట్టం ముందు నేరం అని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. కారణాలు ముందస్తుగా చెప్పకుండా, అకారణంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. వెంటనే కౌశిక్ రెడ్డిని విడుదల చేయాలని వినోద్ కుమార్ పోలీసులకు సూచించారు.