Gampa Govardhan | కామారెడ్డి : బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేయడం సరైన నిర్ణయం అని మాజీ ప్రభుత్వ విప్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారైనా పార్టీ తీసుకునే చర్యలకు సిద్ధం కావాల్సిందేనని తెలిపారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్నీ తీవ్రంగా పరిగణిస్తున్నది. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది.