Jagadish Reddy | పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటమి రెండూ ఓటడిపోతున్నాయని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. భువనగిరిలో ఆయన శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడే భాయ్.. ఛోటే భాయ్ కేసీఆర్‌పై చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందన్నారు. చిన్నాచితక పార్టీలు, జిల్లా పరిమితమైన పార్టీలతో స్నేహబంధం కలుపులకునే పరిస్థితుల్లో ఉన్నాడంటే మోదీ ఓడిపోతున్నారన్నారు.
ఈ రెండు కూటమిలో లేని ప్రాంతీయ పార్టీలే చక్రం తిప్పబోతున్నాయన్నారు. మోదీ, అమిత్‌షా మాటాలు వారి స్థాయిని దిగజార్చేలా ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనికి రాడని ప్రజలకు అర్థమైందని.. బడే భాయ్.. ఛోటే భాయ్ ఇద్దరు కలిసినా చిన్న మార్క్‌ను చూపించలేకపోయారన్నారు. ఛోటే భాయ్ రాష్ట్రంలో అధికారం వచ్చి ఆరోపణలు, అసత్యాలు తప్ప ఏమీ తేల్చలేకపోయారన్నారు. కాంగ్రెస్ కొత్త హామీల సంగతి పక్కన పెట్టిన.. పాత పథకాలను కొనసాగించే పరిస్థితి లేదన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు బీఆర్ఎస్ గెలవబోతుందన్నారు.