Jagadish Reddy | ఒక్క నోటీసుకే రేవంత్ వణికిపోయి హంగామా చేస్తున్నాడని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. నల్గొండ బీఆర్ఎస్ కార్యాలయంలో మాట్లాడారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి క్రిశాంక్‌ను చౌటుప్పల్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఆరోపించారు. పోలీసులు అరెస్ట్ చేస్తే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేస్తే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్‌పై కేసులు పెడుతున్నారని.. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పని చేస్తున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి మంత్రులను కలవమంటున్నారని.. కాంట్రాక్టర్లను బెదిరించి బిల్లులు ఆపుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమైందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులను బెదిరించి పని చేయించుకుంటున్నారు. నాలుగు నెలల్లో పెయిల్ అయిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. ఒక్క నోటీసుకే ఒనికి పోయి హంగామా రేవంత్ రెడ్డి, ఆయన బూట్లు తుడుస్తున్న మంత్రులు అంటూ విమర్శించారు. పోలీసులు, జైళ్లు అనే పదం వాడకుండా పరిపాలన చేయలేకపోయాని.. మోదీ బడే భాయ్ తరహాలో.. ఛోటే భాయ రేవంత్ కూడా జైలు భాష వాడుతున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని మరిచిపోయి డ్రామాలతో పాలన కొనసాగిస్తున్నారన్నారు.
క్రిశాంక్ అడ్రెస్ ఎక్కడో వెంటనే డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధిపై జానారెడ్డి వ్యాఖ్యలు అవాస్తవమని.. బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రైతుబంధు రాలేదు అన్న వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుని చెప్పుతో కొడతావా? అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని తాను అడుగుతున్నానన్నారు. చెప్పుతో కొడతావా..? లేదా మేరా కొట్టించుకుంటారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్‌యాత్ర తర్వాత కాంగ్రెస్‌లో వణుకు మొదలైందని.. నోటీసుల నాటకం ఛోటే భాయ్.. బడా భాయ్ బాయి డ్రామాలో భాగమేనన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలువబోతుందన్నారు. చలకుర్తి 35 ఏళ్ల అభివృద్ధిపై జానారెడ్డితో చర్చకు సిద్ధమన్నారు. పెద్దరికాలను అడ్డం పెట్టుకుని ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధం అయ్యారన్నారు. రెండు జాతీయ పార్టీలకు అవకాశం ఇస్తే తెలంగాణ నాశనం అవుతుందనన్నారు. తెలంగాణకు కేసీఆరే శ్రీరామ రక్ష అని.. రిజర్వేషన్లపై తమ పార్టీ వైఖరి స్పష్టంగా చెప్పామన్నారు.