సూర్యాపేట : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ హత్యలు మొదలయ్యాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఆరు నెలల క్రితమే కాంగ్రెస్ పార్టీ అంతర్గత తగదాలతో ఒక హత్య జరిగిందని, పోలీసుల నిర్లక్ష్యంవల్లే హత్య జరిగిందని తాను ఆ రోజే చెప్పానని అన్నారు. అయినా నిర్లక్ష్యం వీడకపోవడంతో ఈరోజు ఇంకో హత్య జరిగిందని మండిపడ్డారు.
ఈ గడ్డపై కాంగ్రెస్ పార్టీ నాయకులు హత్యలు చేసిన సంస్కృతి గతంలో కూడా ఉందని జగదీష్‌రెడ్డి విమర్శించారు. మేము పదేళ్లలో ఆ సంస్కృతిని రూపుమాపడానికి ఎంతో కృషి చేశామని అన్నారు. కానీ అధికారంలోకి రాగానే మళ్ళీ హత్యలు మొదలు పెట్టారని మండిపడ్డారు. హత్యకు గురైన మల్లయ్య కుటుంబానికి పార్టీ తరపున తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పారు.
మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి కేటీఆర్ వస్తానన్నారని, కానీ ప్రస్తుత పంచాయతీ ఎన్నికల వేళ పరిస్థితులు ఉద్రిక్తం అవ్వకూడదని తామే తర్వాత పరమర్శించాలని కోరామని జగదీష్ రెడ్డి తెలిపారు. అంతముందు ఆయన హతుడు మల్లయ్య భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకుల చేతిలో హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త మల్లయ్య భౌతికకాయానికి నివాళులర్పించి, వారి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ https://t.co/Fak30RAChR pic.twitter.com/KmPeAw7Jv3
— Telugu Scribe (@TeluguScribe) December 10, 2025