Harish Rao | నిర్లక్ష్యం వీడి కరెంట్ కోతలను అరికట్టండి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీశ్‌రావు సూచన
Harish Rao | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల్లో కరెంట్ కోతలు సర్వ సాధారణంగా మారాయని ప్రజలు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కరెంట్ కోతలను నివారించాలని విద్యుత్ అధికారులకు రోజు కొన్ని వేల వినతులు వస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎప్పుడంటే ఎప్పుడు కరెంట్ కోతలు కొనసాగుతూనే ఉన్నాయి.
Harish Rao | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల్లో కరెంట్ కోతలు సర్వ సాధారణంగా మారాయని ప్రజలు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కరెంట్ కోతలను నివారించాలని విద్యుత్ అధికారులకు రోజు కొన్ని వేల వినతులు వస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎప్పుడంటే ఎప్పుడు కరెంట్ కోతలు కొనసాగుతూనే ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో గంటల కొద్ది కరెంట్ కోతలు ఉంటున్నాయని వచ్చిన వార్తా కథనాలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కరెంట్ కోతలు ఉండటం విద్యుత్ నిర్వహణ లోపానికి నిదర్శనం అని పేర్కొన్నారు. విద్యుత్ సౌధ పక్కనే ఉన్న ఆనంద్ నగర్, మాసాబ్ ట్యాంక్‌లో రాత్రి నుంచి ఉదయం వరకు కరెంటుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడితే పట్టించుకునే వారే కరువయ్యారు అని తెలిపారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి కరెంటు కోతలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు.
సీఎం ప్రసంగిస్తుండగా నిన్న కరెంట్ కట్
పాలమూరు జిల్లాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతుండగా 10 నిమిషాల తర్వాత 6:42 గంటల సమయంలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఫ్యాన్లు, లైట్లు ఆఫ్ అయ్యాయి. ఫంక్షన్హాల్లో ఉన్న జనరేటర్ సహాయంతో కార్యక్రమం కొనసాగింది. సీఎం వెళ్లిపోయాక విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఎక్కడా నిమిషం కూడా కరెంట్ పోవడం లేదని సీఎం చెప్పారు.. కానీ ఆయన ప్రసంగంలోనే కరెంట్ పోవడం గమన్హరం.
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కరెంట్ కోతలు ఉండటం విద్యుత్ నిర్వహణ లోపానికి నిదర్శనం.
విద్యుత్ సౌధ పక్కనే ఉన్న ఆనంద్ నగర్, మాసాబ్ ట్యాంక్‌లో రాత్రి నుంచి ఉదయం వరకు కరెంటుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడితే పట్టించుకునే వారే కరువయ్యారు.
ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి కరెంటు కోతలను… pic.twitter.com/3khwanWK8d
— Harish Rao Thanneeru (@BRSHarish) July 10, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

