Harish Rao | సిద్దిపేట : జమ్మూకశ్మీర్‌లో వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్లకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారని అన్నారు.
జవాన్ మురళీ నాయక్ చేసిన పోరాటం, చూపిన సాహసం వృథా కాదని, భారతదేశం ఖచ్చితంగా గొప్ప విజయం సాధిస్తుందని హరీష్ రావు ఆకాంక్షించారు. దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండి, జవాన్ల కుటుంబాలకు అండగా నిలబడాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.