Harish Rao | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్క యూరియా బస్తా కోసం నిద్రాహారాలు మాని రైతులు వ్యవసాయ సహకార సంఘాల వద్ద పడిగాపులు గాస్తున్నారు. భారీ క్యూలైన్లో నిల్చున్నప్పటికీ చివరి రైతు వరకు దొరుకుతుందో.. దొరకదో తెలియని అయోమయ పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి దాపురించింది.
మహబూబాబాద్ జిల్లా గూడూరులో యూరియా కోసం రైతులు పడుతున్న అవస్థకు సంబంధించిన వీడియోను మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ముసురు వానలో రైతన్నలు రోడ్డెక్కితే.. రేవంత్ సర్కార్ మాత్రం మొద్దు నిద్రలో ఉందని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతతో అన్నదాత కలత చెందుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. యూరియా కూడా సరఫరా చేయలేని దిక్కుమాలిన ప్రజాపాలన ఇది అని నిప్పులు చెరిగారు. అభయహస్తం కాదు.. రైతన్నల పాలిట భస్మాసుర హస్తం అయ్యింది కాంగ్రెస్ ప్రభుత్వం అని హరీశ్‌రావు విమర్శించారు.
మహబూబాబాద్ జిల్లా గూడూరులో యూరియా కోసం రైతులు పడుతున్న అవస్థ ఇది.
ముసురు వానలో రోడ్డెక్కిన రైతన్న..
మొద్దు నిద్రలో @revanth_anumula సర్కారురాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత, అన్నదాత కలత… పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం
యూరియా కూడా సరఫరా చేయలేని దిక్కుమాలిన ప్రజాపాలన.… pic.twitter.com/1lTO4VkXY9
— Harish Rao Thanneeru (@BRSHarish) August 16, 2025