Harish Rao : బీఆర్ఎస్ అధినేత (BRS chief) కేసీఆర్ (KCR) ఆదివారం నిర్వహించిన ప్రెస్‌మీట్ (Press meet) లో రాష్ట్ర ప్రయోజనాల గురించే మాట్లాడారని మాజీ మంత్రి (Ex Minister) హరీశ్‌రావు (Harish Rao) చెప్పారు. ఆయన పాలనలో రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టి సాధించిందని అన్నారు. తెలంగాణ భవన్ (Telangana Bhavan) లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన విమర్శలపై హరీశ్‌రావు స్పందించారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అద్భుత ఆర్థిక ప్రగతి సాధించిందని అన్నారు. జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో కేసీఆర్ రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా నిలిపారని చెప్పారు. మూడురెట్ల జీఎస్డీపీ, తలసరి ఆదాయం పెరిగిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక అరాచకత్వం జరిగిందని రేవంత్ ఆరోపించారని, రాజకీయాల కోసం రాష్ట్రం పరువు తీయొద్దని ఆయనను కోరుతున్నానని తెలిపారు.
సొంత పార్టీ నేతలనే తొక్కుకుంటూ ఎదిగినట్లు రేవంతరెడ్డే స్వయంగా చెప్పారని హరీశ్‌రావు గుర్తుచేశారు. రూ.50 కోట్లు పెట్టి రేవంత్ రెడ్డి పీసీసీ పదవిని కొనుగోలు చేసినట్లు గతంలో కోమటిరెడ్డి చెప్పారని అన్నారు. తమది అలాంటి నాయకత్వం కాదని, నిజాయతీగా త్యాగాల పునాదులపై ఎదిగిన నాయకత్వమని చెప్పారు. ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులను గడ్డిపోచల్లా త్యాగాలు చేసిన చరిత్ర తమ పార్టీ నేతలదని అన్నారు.