ఆదిలాబాద్, మార్చి 11(నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లా విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఈడబ్ల్యూఐడీసీ) శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జిన్నంవార్ శంకర్ మంగళవారం జిల్లా కేంద్రంలోని బాలికల మైనార్టీ రెసిడెన్షియల్ నిర్మాణ సంస్థలో రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. రూ. 2కోట్లతో ని ర్మించిన బాలికల మైనార్టీ స్కూల్ బిల్డింగ్ కాంట్రాక్టర్ నుంచి డీఈ శంకర్ రూ.2 లక్షలు డిమాండ్ చేశాడు. కాంట్రాక్టర్ అభ్యర్థన మేరకు రూ. లక్షకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. మొదటి విడతగా రూ.50 వేలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. నిందితుడిని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నారు.