హైదరాబాద్ : తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం ( శుభకృత్ నామ సంవత్సరం) సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘శుభకృత్’ అంటే శుభాలను కలిగించేదని, కొత్త ఏడాదిలో అందరికి శుభమే జరగాలని ఆయన అకాంక్షించారు. ఉగాది పండుగను రాష్ట్ర ప్రజలందరు ఉత్సాహంగా జరుపుకోవాలని మంత్రి సూచించారు.