ప్రతి రైతుకూ ‘భరోసా’ఇవ్వాల్సిందే
రైతుభరోసాను కోతలు పెట్టి, ఏ కొద్దిమందికో అందించడం సరికాదని.. రైతులందరికీ ‘భరోసా’ ఇవ్వాల్సిందేనని హసన్‌పర్తి మండలం గుంటూరుపల్లికి చెందిన ఎస్ రమాదేవి మంత్రుల ఎదుటే తేల్చి చెప్పారు.
- ఎకరాలతో సంబంధం లేకుండా అమలు చేయాలి
- లేదంటే వేల ఎకరాలు పడావుగా మారుతాయి
- పెట్టుబడి కష్టానికి కొంతలో కొంత ఆసరా భరోసా
- వరంగల్‌లో మంత్రుల ముందు కుండబద్దలు కొట్టిన గుంటూరుపల్లి మహిళారైతు రమాదేవి
వరంగల్, జూలై 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతుభరోసాను కోతలు పెట్టి, ఏ కొద్దిమందికో అందించడం సరికాదని.. రైతులందరికీ ‘భరోసా’ ఇవ్వాల్సిందేనని హసన్‌పర్తి మండలం గుంటూరుపల్లికి చెందిన ఎస్ రమాదేవి మంత్రుల ఎదుటే తేల్చి చెప్పారు. రైతు భరోసా అనేది అన్నదాత కష్టానికి అందించే చిన్న పెట్టుబడి సాయం మాత్రమేనని పేర్కొన్నారు. వరంగల్‌లో సోమవారం రైతుభరోసా విధివిధానాలకు సంబంధించి నిర్వహించిన అభిప్రాయ సేకరణ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘ఎకరాలతో సంబంధం లేకుండా ప్రతి రైతుకు రైతుభరోసా వర్తింపజేయాలి. 5,10 ఎకరాలని నిబంధన పెడితే చాలా భూములు బీడువారిపోతాయి. సాగుచేసే భూమికే ఇస్తామంటే 30, 50 ఎకరాలు ఉన్నవారు ఖాళీగా ఉంచకుండా కౌలుకు ఇస్తారు. భూమి ఉన్న రైతులకే పథకం అందించాలి. రైతు పడే కష్టంలో రైతు భరోసా చిన్న పెట్టుబడి మాత్రమే. పంట నష్టపోతే పరిహారం ఇవ్వాలి. పండ్లు, కూరగాయల తోటలు పెట్టేలా రైతులను ప్రొత్సహించాలి. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఏ రైతు ఏ పంట వేస్తున్నాడన్న వివరాలు సేకరించి అర్హులకు రైతు భరోసా అమలు చేయాలి. వర్షాలు పడితే తొవ్వలు ఇబ్బందిగా ఉంటున్నాయి. గ్రామాల్లో సీసీ రోడ్లు వేయడం కాదు, బాయిలకాడికి వెళ్లేందుకు కూడా రోడ్లు వేయాలి. కూరగాయల విత్తనాలను సబ్సిడీపై అందించాలి’ అని రమాదేవి కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

