హైదరాబాద్ : ఇటీవల ఎవరెస్టు ( Everest ) ఎక్కి మృత్యువాత పడ్డ పర్వతారోహకులు ఇద్దరిని తెలుగువారిగా గుర్తించారు. వీరిలో ఒకరు ఏపీ ( AP )వాసి కాగా, మరొకరు తెలంగాణ ( Telangana ) వాసిగా వెల్లడించారు. ఈనెల 20న ఎవరెస్టు అధిరోహించి కిందకు దిగుతుండగా అనారోగ్యానికి గురై మృతి చెందారు.
మృతుల్లో ఒకరు హిందూపురం ప్రాంతానికి చెందిన సందీప్ ఆరే( Sandeep Arey ) అమెరికాలో స్థిరపడి సాప్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నట్లు సమాచారం. మే 20న ఎవరెస్టు శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన సందీప్ మరుసటి రోజు తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. ఈయన గతంలో కిలిమంజారో సహా పలు శిఖరాలను అధిరోహంచిన అనుభవం ఉంది.
మరో మృతుడు హైదరాబాద్ ( Hyderabad ) లో స్థిరపడిన యూపీకి చెందిన అరుణ్‌కుమార్ తివారీ ( Arunkumar Tiwari ) గా గుర్తించారు . తివారీ ఐటీ రంగంలో పనిచేస్తూ పర్వతారోహణలో అనుభవం సంపాదించాడు. రష్యా, అమెరికా, అర్జెంటీనాల్లోని పర్వతాలను విజయవంతంగా అధిరోహించిన తివారీ ఎవరెస్టు దిగివస్తూ తీవ్ర అలసటకు గురయ్యారు. ఎత్తు ప్రభావంతో ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా ఇద్దరిని గైడ్లు తీవ్రంగా ప్రయత్నించినా కాపాడలేకపోయినట్లు సమాచారం. మృతదేహాలను దిగువు తీసుకురావడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.