గ్రేటర్ హైదరాబాద్‌లో ఇంటింటి చెత్త సేకరణ నిర్వహణ సరిగా లేదు. రోజూవారీగా చెత్తను సేకరించటం లేదు. మా ఇంటికి సైతం చెత్తబండి రావటం లేదు. దాంతో మేమూ ఇబ్బందులు పడుతున్నాం.
Amrapali | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ‘గ్రేటర్ హైదరాబాద్‌లో ఇంటింటి చెత్త సేకరణ సరిగా లేదు. రోజూవారీగా చెత్తను సేకరించటం లేదు. మా ఇంటికి సైతం చెత్తబండి రావటం లేదు. మేము కూడా ఇబ్బందులు పడుతున్నాం’ అంటూ గురువారం స్వయానా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ క మిషనర్ ఆమ్రపాలి పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో పారిశుద్ధ్య నిర్వహణ ఎంత అధ్వానంగా ఉన్నదో చెప్పడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం. ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఐఏఎస్‌లు, ప్రముఖులు ఉండే రాజధాని దుస్థితి ఇది. ఇక పల్లెల దుస్థితిని మాటల్లో వర్ణించలేం. బీఆర్ఎస్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి, పట్టణ ప్రగతిని అటకెక్కించిన కాంగ్రెస్ సర్కారు చర్యల ఫలితంగా ఇప్పుడు ఎక్కడ చూసినా చె త్తాచెదారమే కనిపిస్తున్నది. పారిశుద్ధ్య కార్మికులకు కొన్ని నెలలుగా వేతనాలు ఇవ్వకపోవటం తో వాళ్లు విధులు నిర్వర్తించటం లేదు. ఈ సమస్యపై మాజీ మంత్రి హరీశ్‌రావు గొంతెత్తడం తో.. గురువారమే కార్మికులకు వేతనాలు విడుదల చేస్తున్నట్టు మంత్రి సీతక్క ప్రకటించారు. కానీ ఇప్పటికే డెంగ్యూ, మలేరియా, చికున్గున్యాతోపాటు అంటువ్యాధులు తీవ్రంగా ప్రబలాయి. ఇటీవల రాష్ట్రంలో ఇద్దరు నిండు గర్భిణులు డెంగ్యూ సోకి కన్నుమూశారు. వర్షాలు భారీగా కురుస్తుండటంతో పారిశుద్ధ్య నిర్వహణ నానాటికీ అధ్వానంగా మారింది.
పారిశుద్ధ్య నిర్వహణలో జీహెచ్ఎంసీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ‘నమస్తే తెలంగాణ’ పలుమార్లు ప్రత్యేక కథనాలను ప్రచురించింది. అయినా అధికారుల్లో చలనం లేదు. రాజధానిలో సుమారు 5,250 స్వచ్ఛ ఆటోల ద్వారా నగరంలో 4,886 కాలనీల్లో 23 లక్షల గృహాల నుంచి రోజుకు 7 వేల మెట్రిక్ టన్నులకు పైగా చెత్త సేకరణ జరగాలి. ఒక్కో ఆటోకు 500-600 ఇండ్లు కేటాయించి, చెత్త సేకరణ చేపట్టాలి. కొన్ని రోజులుగా స్వచ్ఛ ఆటోల పనితీరు సరిగా లేదు. రోజుకు దాదాపు 1,000 స్వచ్ఛ ఆటోలు పనిచేయటం లేదని స్వయంగా గత కమిషనర్ రోనాల్డ్‌రోస్ గుర్తించారు. ఇటీవల కమిషనర్ ఆమ్రపాలి సైతం స్వచ్ఛ ఆటోల పనితీరుపై సమీక్షించి స్వచ్ఛ ఆటోలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినా ఫలితం లేదు.
అచ్చంపేటటౌన్, ఆగస్టు 8: విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురైన ఘటన గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం లింగోటం ఆక్స్ఫర్డ్ ప్రైవేట్ పాఠశాల హాస్టల్లో జరిగింది. విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి పాఠశాలను తనిఖీ చేయాలని డీడీఎంహెచ్‌వో తారాసింగ్‌ను ఆదేశించారు. ఆయన హాస్టల్ భోజనాన్ని పరిశీలించారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను జిల్లా వైద్యాధికారి పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో 820 మందికి 525 మంది అల్పాహారం తీసుకున్నారని, వారిలో 34 మంది అస్వస్థతకు గురికాగా.. అచ్చంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించామని తెలిపారు.