హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): నల్లగొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గ టీచర్స్ ఎమ్మె ల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచిన పూల రవీందర్‌కు ఎట్‌గ్రీవ(ఆల్ తెలంగాణ గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్) మద్దతు ప్రకటించింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కూకట్ల యాదయ్య ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పీఆర్టీయూ అభ్యర్థులకు ఆరు సంఘాలు..
పీఆర్టీయూటీఎస్ అభ్యర్థులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, మంగ మహేందర్‌రెడ్డికి ఆరు సంఘాలు మద్దతు పలి కాయి. ఈ మేరకు ఆదివారం నారాయణగూడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయా సంఘాలు తమ మ ద్దతు లేఖలను అందజేశాయి. మద్ద తు తెలిపిన సంఘాల్లో తెలంగాణ స్టేట్ గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేష న్ తెలంగాణ, ఉర్దూ టీచర్స్ అసోసియేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ ఉన్నాయి.