ఉప్పల్, ఏప్రిల్ 1 : ఉప్పల్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఈటల రాజేందర్ అభిమానులు వీరంగం సృష్టించారు. హుజురాబాద్ ఈటల దళిత బాధితుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ రచ్చ జరిగింది. ‘ఈటల చేసిన మోసాలు, దళితులు ఎదుర్కొంటున్న బాధలు’ అనే కరపత్రాలను సంఘం అధ్యక్షుడు తిప్పారపు సంపత్, అతని అనుచరులు ఆవిష్కరించారు. తమ నాయకుడికి వ్యతిరేకంగా సమావేశం పెట్టారని ఈటల అభిమానులు ప్రెస్‌క్లబ్‌లోకి వచ్చి లోగోలు, మైకులు, కుర్చీలు విరగ్గొట్టారు. సంపత్, అతని అనుచరులతోపాటు అడ్డువచ్చిన మీడియా ప్రతినిధులపైనా దాడిచేశారు. వీడియోలు చిత్రీకరిస్తున్న ఫోన్లను కిందపడేశారు. ఈ ఘటనపై బాధితుడు సంపత్, జర్నలిస్టు నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేశామని ఉప్పల్ సీఐ ఎలక్షన్‌రెడ్డి తెలిపారు. ఈటల రాజేందర్‌పై కేసు నమోదు చేసి, తమకు రక్షణ కల్పించాలని సంపత్ డీజీపీని కోరారు.