ASSI Trailer | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను తన విలక్షణ నటనతో మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యింది. ప్రముఖ దర్శకుడు అనుభవ్ సిన్హా దర్శకత్వంలో ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘అస్సీ’ (ASSI). ఈ సినిమా ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూస్తుంటే.. తాప్సీ ఇందులో మరోసారి లాయర్ పాత్రలో(ఇంతకుముందు ముల్క్ చిత్రంలో) కనిపించబోతుంది. ఈ సినిమా టైటిల్‌ను హైలైట్ చేస్తూ.. దేశంలో ప్రతిరోజు 80 మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారని.. వారికోసం పోరాడే న్యాయవాది పాత్రలో తాప్సీ అలరించబోతుంది.
అనుభవ్ సిన్హా-తాప్సీ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘ముల్క్’, ‘థప్పడ్’ చిత్రాలు సామాజిక అంశాలతో ఘనవిజయం సాధించాయి, దీంతో ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కోర్ట్‌రూమ్ డ్రామాలో నసీరుద్దీన్ షా, రేవతి, కని కుసృతి, మనోజ్ పహ్వా వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.