ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 13, 2020 , 01:57:01

అట్రాసిటీ కేసుల పరిష్కారం హర్షణీయం

అట్రాసిటీ కేసుల పరిష్కారం హర్షణీయం
  • ఎస్సీ, ఎస్టీ కమిషన్‌తో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మారుమూల తండాలు, గ్రామాల్లో పర్యటించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను పరిష్కరించడం హర్షణీయమని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు ప్రశంసించారు. గురువారం అసెంబ్లీ వద్ద మంత్రి కేటీఆర్‌తోపాటు మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ను ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ మర్యాదపూర్వకంగా కలిసి, కమిషన్‌ ప్రచురించిన డైరీ, సావనీర్‌, క్యాలెండర్లను అందజేశారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ నిర్వహిస్తున్న కార్యక్రమాలను కేటీఆర్‌కు వివరించారు. మంత్రులను కలిసినవారిలో కమిషన్‌ సభ్యులు విద్యాసాగర్‌, రాంబల్‌నాయక్‌, నీలదేవి ఉన్నారు.


logo