ఫైన్ కాలేజీకి.. శిక్ష విద్యార్థికి!
నేషనల్ మెడికల్ కమిషన్ తాజా నిర్ణయంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు రూ.కోటి జరిమానా విధిస్తామని ఎన్ఎంసీ ఇటీవల ‘మెయింటెనెన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్-2023’లో పేర్కొన్నది.
- కోటి జరిమానా విధిస్తామన్న ఎన్ఎంసీ.. నిపుణుల ఆందోళన
హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): నేషనల్ మెడికల్ కమిషన్ తాజా నిర్ణయంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు రూ.కోటి జరిమానా విధిస్తామని ఎన్ఎంసీ ఇటీవల ‘మెయింటెనెన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్-2023’లో పేర్కొన్నది. సదుపాయాల్లో లోపాలు ఉన్నా, బోధన, బోధనేతర సిబ్బందికి సంబంధించి ఏవైనా అవకతవకలకు పాల్పడినా, ఇతర నిబంధనలను పాటించకున్నా కాలేజీకి రూ.కోటి వరకు జరిమానా విధిస్తామని ఎన్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు పత్రాలు సమర్పిస్తే ఆయా విభాగాల అధిపతులు, డాక్టర్లకు రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తామని పేర్కొన్నది. అంతేకాదు.. మెడికల్ కాలేజీ నుంచి ఏదేని దరఖాస్తు విషయంలో ఎన్ఎంసీ లేదా బోర్డుపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తే ‘ఆన్యువల్ డిస్క్లోజర్ రిపోర్ట్’ (ఏడీఆర్), ఇతర పత్రాలను తెప్పించుకొని పరిశీలిస్తామని హెచ్చరించింది. ఈ నిబంధనలు అంతిమంగా విద్యార్థులపైనే భారం మోపుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రైవేట్ కాలేజీల్లో మేనేజ్మెంట్, ఎన్నారై కోటాల్లో ఎంబీబీఎస్ చదవాలంటే ఏటా సుమారు 60 లక్షల వరకు ఖర్చవుతున్నదని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ కాలేజీపై జరిమానా విధిస్తే.. ముందుగా వారు తమ జేబులోనుంచే కడుతారని చెప్తున్నారు. తర్వాత విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవడానికి ఫీజులు పెంచుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం కొత్తకొత్త పేర్లతో ఫీజులు వసూలు చేసే అవకాశం ఉన్నదని హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

