ప్రగతి బాటలు కొనసాగుతున్న పల్లె, పట్టణ ప్రగతి

హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఊరూవాడలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు. పరిసరాలను పరిశుభ్రపరుస్తున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఎనిమిదో రోజైన గురువారం రాష్ట్రవ్యాప్తంగా 1,522 కిలోమీటర్ల మేర బహుళ వరుస మొక్కలు నాటారు. ఎనిమిది రోజుల్లో బహుళ వరుసలో 2,318 కిలోమీటర్ల మేర మొక్కలు నాటారు. ఇంటింటికి ఆరు మొక్కల చొప్పున అందజేయగా 74 వేల మొక్కలను నాటారు. 23.25 లక్షల మొక్కలను పంపిణీ చేశారు. ఇప్పటివరకు 8.52 లక్షల మొక్కలను నాటారు.
ప్రకృతి వనం అద్భుతం

ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడులో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, కలెక్టర్ కర్ణన్‌తో కలిసి రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పల్లె ప్రకృతివనాన్ని, వైకుంఠధామాన్ని ప్రారంభించారు. హరితహారంలో మొక్కలు నాటారు. – రఘునాథపాలెం
అభివృద్ధి పథంలో పల్లెలు

గ్రామాల సర్వతోముఖాభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, హౌసింగ్‌శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా గురువారం ఉదయం వారు నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో పర్యటించారు. – వేల్పూర్
పల్లెల సమగ్రాభివృద్ధి

పల్లెల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బంగారుగూడెంలో నిర్వహించిన హరితహారంలో మొక్క నాటి నీళ్లు పోశారు. – కురవి
పల్లెల పరిశుభ్రతే లక్ష్యం

పల్లెలను పరిశుభ్రంగా మార్చడమే పల్లెప్రగతి లక్ష్యమని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
అన్నారు. గురువారం ఆయన నిజామాబాద్ జిల్లా రుద్రూర్లో రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు. కేజీబీవీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి మొక్కలను నాటారు. సులేమాన్నగర్లోనూ మొక్క నాటి నీళ్లుపోశారు. – రుద్రూర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

