బలమైన రాజకీయశక్తిగా బీఆర్ఎస్.. ప్రజల హృదయాల్లో కేసీఆర్ చెరగని ముద్ర
రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమ పార్టీగా ఏర్పడిన బీఆర్ఎస్ తెలంగాణలో నేడు బలమైన రాజకీయ శక్తిగా ఎదిగి ప్రజల మనసులను చూరగొన్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం జనగామ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంతోపాటు దేవరుప్పుల,
- మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారే
- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- జనగామ, దేవరుప్పులలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
జనగామ, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ)/దేవరుప్పుల/పాలకుర్తి : రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమ పార్టీగా ఏర్పడిన బీఆర్ఎస్ తెలంగాణలో నేడు బలమైన రాజకీయ శక్తిగా ఎదిగి ప్రజల మనసులను చూరగొన్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం జనగామ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంతోపాటు దేవరుప్పుల, పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురంలో గులాబీ జెండాను ఎగురవేసి మాట్లాడారు. 26వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన బీఆర్ఎస్ పార్టీకి ఉజ్వల చరిత్ర ఉన్నదని అన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దారని కొనియాడారు.
తెలంగాణ అవసరాలు, వనరులపై పట్టున్న కేసీఆర్ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల హృదయాల్లో నిలిచినట్టు తెలిపారు. ముఖ్యంగా సాగు, తాగునీరు, అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు విధానాన్ని ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకొని అమలు చేసిన చరిత్ర ఉన్నదని అన్నారు. మిషన్ భగీరథను కేంద్రం కాపీ కొట్టిందని చెప్పారు. పదేండ్లు తెలంగాణను అభివృద్ధిలో ముందువరుసలో నిలిపారని కొనియాడారు. రెండున్నరేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. అధికారంలో ఉన్నా లేకున్నా సమస్యలపై ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో తిరిగి వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ఉద్యోగాల కోత.. 5 శాతం సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు!
Tragedy | పాకాల బీచ్‌లో విషాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరు గల్లంతు
ఎంవి పాలెం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం?
Mrunal Takhur | ఇతరుల జీవితాలపై కామెంట్స్ చేయడానికి మీరెవరు.. మృణాల్ ఠాకూర్ సీరియస్
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

