
నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 26: అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మోసం చేసే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటెయ్యొద్దని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. కార్పొరేషన్ ఎన్నికల్లో భాగం గా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బో యినపల్లి వినోద్‌కుమార్, చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో సోమవారం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. నగర ప్రజలు ఆలోచించి టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయలని కోరారు. బీజేపీ నేతలు ఎందరొచ్చినా వరంగల్‌లో ఆ పార్టీ గెలవదని చెప్పారు. అనంతరం బీ వినోద్‌కమార్ మాట్లాడుతూ.. వరంగల్ నగర అభివృద్ధిపై బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కా వాలంటే టీఆర్ఎస్ను గెలిపించుకోవాలని కోరారు. సిద్దిపేటలో టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఆపత్కాలంలోనూ నిరుపేదలకు అండగా ఉన్న పార్టీ టీఆర్ఎస్సేనని స్పష్టంచేశారు. దేశంలో ఏనాడైనా కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు బీడీ కార్మికులకు ఒక్క రూపాయి ఇచ్చినట్టు నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాసానని సవాలు విసిరా రు. మంత్రి వెంట ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప ద్మాదేవేందర్‌రెడ్డి, పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ఎ న్నికల ప్రచారం నిర్వహించిన ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. అన్నంపెట్టే పార్టీని ఆదరించి టీఆర్ఎస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.