హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : బీటెక్ ఫస్టియర్ సీట్ల భర్తీకి నిర్వహించే ఎప్సెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ మంగళవారం విడుదలకానున్నది. ఈ నెల 30 లేదా జూలై 1 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది.
మంగళవారం షెడ్యూల్ విడుదల కాని పక్షంలో బుధవారం ఈ షెడ్యూల్ను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.