చెన్నై : ఓ విద్యార్థిని శ్రద్ధగా పరీక్ష రాస్తుండగా.. ఆమె పట్ల విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె పరీక్షకు ఆటంకం కలిగిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన తమిళనాడులోని శ్రీరంగంలో చోటు చేసుకుంది.
హిజయార్ మహ్మద్ యూసుఫ్ గవర్నమెంట్ స్కూల్లో మురుగేషన్ అనే వ్యక్తి ఇంగ్లీష్ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఇదే పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై ఇంగ్లీష్ టీచర్ కన్నేశాడు. ఆమె ఎగ్జామ్ రాస్తుండగా.. లైంగికంగా వేధించాడు టీచర్. అసభ్యకరంగా ప్రవర్తించాడు.
ఇంటికి వెళ్లిన బాధిత విద్యార్థిని తనకు జరిగిన వేధింపుల గురించి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులతో పాటు 500 మంది గ్రామస్తులు స్కూల్‌ను చుట్టుముట్టారు. మురుగేషన్పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మొత్తానికి ఇంగ్లీష్ టీచర్‌పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధిత విద్యార్థినితో పాటు మిగతా విద్యార్థులను పోలీసులు విచారిస్తున్నారు.