హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఏఎఫ్ఆర్సీ సిఫారసుల మేరకు 159 కాలేజీల్లో ఫీజులను ఖరారు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజినీరింగ్ కాలేజీల్లో కనీస రుసుం రూ. 45 వేలకు పెంచారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 40 కాలేజీల్లో రూ. లక్ష దాటింది. ఎంజీఐటీలో రూ. 1.6 లక్షలు, సీవీఆర్లో రూ. 1.5 లక్షలు, సీబీఐటీ, వర్ధమాన్, వాసవి ఇంజినీరింగ్ కాలేజీల్లో రూ. 1.4 లక్షల చొప్పున పెంచారు. ఈ ఫీజులు మూడేండ్ల పాలు అమల్లో ఉండనున్నాయి.
ఇక ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ ఫీజులను కూడా పెంచుతూ ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో కనీస వార్షిక ఫీజు రూ. 27 వేలుగా ఖరారు చేశారు. ఎంటెక్ కనీస వార్షిక ఫీజు రూ. 57 వేలుగా నిర్ణయించారు.
ఫీజు ఖరారు చేసిన కాలేజీల జాబితా