Engineering Colleges | ఇంజినీరింగ్ కాలేజీల ఫీజుల పెంపు?.. నెల రోజుల్లో నోటిఫికేషన్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల ట్యూషన్ ఫీజుల సవరణకు రంగం సిద్ధమవుతున్నది. 2025-28 బ్లాక్ పీరియడ్‌కు సంబంధించిన ఫీజుల సవరణ అంశంపై తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) శుక్రవారం పలు ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో సన్నాహక సమావేశం నిర్వహించింది.
- యాజమాన్యాలతో టీఏఎఫ్ఆర్సీ సమావేశం
Engineering Colleges | హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల ట్యూషన్ ఫీజుల సవరణకు రంగం సిద్ధమవుతున్నది. 2025-28 బ్లాక్ పీరియడ్‌కు సంబంధించిన ఫీజుల సవరణ అంశంపై తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) శుక్రవారం పలు ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో సన్నాహక సమావేశం నిర్వహించింది. నెల రోజుల్లోపు ఫీజుల సవరణకు నోటిఫికేషన్‌ను జారీచేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇంజినీరింగ్ ఫీజులను ప్రతి మూడేండ్లకు ఒకసారి సవరిస్తున్నారు. గతంలో 2022లో ఫీజులను సవరించారు.
2022-25 బ్లాక్ పీరియడ్ ట్యూషన్ ఫీజుల గడువు ఈ విద్యా సంవత్సరంతో ముగియనున్నది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 2025-28 బ్లాక్ పీరియడ్ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో టీఏఎఫ్ఆర్సీ ఫీజుల సవరణకు సన్నాహక సమావేశం నిర్వహించింది. ఇటీవలి కాలంలో అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనేక మార్పులు చేసింది. ఆయా మార్పులతోపాటు 7వ పే కమిషన్ సిఫారసు ప్రకారం వేతనాలు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ సంఖ్య వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. మార్గదర్శకాల రూపకల్పనపై కూడా సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. తమ ప్రతిపాదనలను వినతిపత్రం రూపంలో సమర్పిస్తామని, వాటిని పరిగణనలోకి తీసుకోవాలని కాలేజీల యాజమాన్యాలు కోరినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

