హైదరాబాద్, డిసెంబర్ 23(నమస్తే తెలంగాణ) : పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణాలో అనుకూలమైన వాతావరణం నెలకొల్పామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. హుస్సేన్‌సాగర్‌లో పూడికతీతతోపాటు మురుగునీటి శుద్ధికోసం సీవరేజ్ ప్లాంట్ల ఏర్పాటులో మలేషియా సంస్థలు పాలు పం చుకోవాలని పేర్కొన్నారు. సచివాలయంలో సోమవారం మలేషియా వాణిజ్య ప్రతినిధుల బృందంతో జరిగిన స మావేశంలో మాట్లాడారు. కిన్నెరసాని, శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను పర్యాటక ఆకర్షణీయ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు రి సార్టులు నిర్మించాలని శ్రీధర్‌బాబు పే ర్కొన్నారు. మలేషియా నుంచి పామాయిల్ విత్తనాలు సరఫరా, నర్సరీల ఏ ర్పాటుకు ముందుకు రావాలని మంత్రి తు మ్మల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.